అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణం వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధుల్నీ అప్పగించొద్దని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఎఎస్ అధికారుల పేర్లు పంపాలని సూచించింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు రావడంతో ఈ మేరకు వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు చేపట్టింది.
Tags AMARAVARTHI
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News