Breaking News

జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దాం..

-ఇతర పోలింగు సిబ్బంది ఏప్రియల్ 22 లోగా ఫారం 12 ను అందచేయాలీ
-నియోజక వర్గ ప్రథాన కార్యస్థానం తహసీల్దార్లు అందచెయ్యాండి
-కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇతర పొలింగ్ సిబ్బంది (ఓ పీ వో) ఏప్రియల్ 22 లోగా సంబంధిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులకు ఫారం 12 అందచేసి, పోస్టల్ బ్యాలెట్ సదుపాయం పొందాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియ చేశారు .

జిల్లా వ్యాప్తంగా పిసైడింగ్, సహయ ప్రిసైడింగ్ అధికారుల కు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ లో భాగంగా ఫారం 12 లకి స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దాం అని పిలుపు నిచ్చారు. ఎన్నికల విధులలో పోలింగు రోజున విధులను నిర్వర్తించే ఇతర పొలింగ్ సిబ్బందికి కూడా ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఆమేరకు ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులకు జత చేసి ఫారం 12 సంబంధిత డ్రాయింగ్ అధికారి ద్వారా పంపించినట్లు తెలిపారు. ఆయా ఇతర పొలింగ్ సిబ్బంది (ఓ పి వో) ఫారం 12 నింపి, ఉత్తర్వుల కాపీ, ఆధార్, ఎపిక్ కార్డు కాపీ లను జత చేసి మీ ఓటు హక్కు కలిగిన రిటర్నింగ్ అధికారులకు / నియోజక వర్గ ప్రధాన కార్యాలయంలో ఉన్న తహసీల్దార్ లకి ఏప్రియల్ 22 లోగా అందచేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలియ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఆమేరకు ఓటు హక్కును వినియోగించు కోవలసి ఉన్నదని పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు. మీరేం చెయ్యాలి ?
అందుకు ఏం చేయాలో సింపుల్ .. ఈ జాగ్రత్తలు పాటించి ఓటు వేద్దాం..

* మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు దాని కోడ్ నెంబర్ తెల్సుకోవాలి.

* మీ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ (బూత్) (పార్ట్ నెంబర్ ) నెంబర్ ఓటర్ల జాబితాలో మీ ఓటు క్రమ సంఖ్య తెల్సుకోవాలి.

* ఫారం 12 పూర్తి చేసి , ఆధార్ , ఆర్డర్, ఓటర్ ఎపిక్ కార్డు కాపీలను జత చేసి మీ ఓటున్న నియోజకవర్గం ప్రథాన హేడ్ క్వార్టర్ లో ఉన్న తహసీల్దార్ కు ఇవ్వాలి.

* నిర్ణయించిన ఫేసిలిటెషన్ కేంద్రం లో ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు.

* 13 ఏ డిక్లరేషన్, 13బి కవర్ – ఏ ; 13సి కవర్ – బీ , ఫారం 13 డి సూచనలు, బ్యాలెట్ ఇస్తారు.

* వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలి. హడావిడి లేకుండా ప్రశాంతంగా చేస్తే ఓటు చెల్లుతుంది.

* 13ఏ – పూరించి మీ సైన్ ,గెజిటెడ్ సైన్, చేయించాలి. గెజిటెడ్ ఆఫీసర్ ను అక్కడే ఏర్పాటు చేస్తారు.

* 13బి కవర్ – ఏ పై పూర్తి చేయాలి. టిక్ చేసిన బ్యాలెట్ ను అందులో పెట్టి సీల్ చేయాలి.

* 13సి కవర్ బి లో కవర్ ఏ లో , 13ఏ డిక్లరేషన్ లను ఉంచి సీల్ చేసి కవర్ పై వివరాలు పూర్తి చేయాలి.

* అక్కడి ఫెసిలిటేషన్ కేంద్రం లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *