Breaking News

నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక నామినేషన్ దాఖలు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక అభ్యర్ధి ఒక నామినేషన్ దాఖలు చెయ్యడం జరిగిందనీ నిడదవోలు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. వైయస్ఆర్ సీపీ తరపున గెడ్డం శ్రీనివాస నాయుడు సన్ ఆఫ్ గెడ్డం ఒక సెట్టు నామినషన్ పత్రాలు , వైయస్ఆర్ సీపీ తరపున తలారి పరం జ్యోతి సన్ ఆఫ్ సూర్య చంద్ర రావు ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చెయ్యడం జరిగిందనీ తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు నిడదవోలు గ్రామ కచేరీలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *