Breaking News

విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీసు విడుద‌ల‌

– ప్రారంభ‌మైన నామినేష‌న్ల ప్ర‌క్రియ‌
– నామినేష‌న్లు స్వీక‌రించిన జిల్లా క‌లెక్ట‌ర్‌, ఆర్‌వో ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధార‌ణ ఎన్నిక‌లు-2024లో భాగంగా విజ‌య‌వాడ పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీస్‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి ఎస్‌.డిల్లీరావు గురువారం ఉద‌యం విడుద‌ల చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నామినేష‌న్లు స్వీక‌రించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. నామినేషన్ దాఖలుకు సంబంధించిన అంశాలపై అవగాహన క‌ల్పించేందుకు ప్ర‌త్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. గురువారం ప్రారంభ‌మైన ఈ నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. ప్ర‌భుత్వ సెల‌వు దినాల్లో మిన‌హా మిగిలిన రోజుల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి నామినేషన్లను ఫైల్ చేయవచ్చన్నారు. నామినేషన్ల దాఖలు స‌మయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలు మాత్రమే అనుమ‌తించ‌బ‌డ‌తాయ‌ని అభ్య‌ర్ధితో స‌హా ఐదుగురు వ్య‌క్తులు మాత్ర‌మే ఆర్వో కార్యాలయంలోకి అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తొలిరోజు నామినేష‌న్లు
– నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు సంబంధించి తొలిరోజు గురువారం ఇద్ద‌రు వ్య‌క్తులు రెండేసి సెట్ల చొప్పున నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ అధికారి ఎస్‌.డిల్లీరావుకు నామినేష‌న్లు స‌మ‌ర్పించారు. సోష‌లిస్టు యునిటీ సెంట‌ర్ ఆఫ్ ఇండియా (క‌మ్యూనిస్టు) పార్టీ నుంచి విజ‌య‌వాడ‌, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌కు చెందిన గుజ్జుల ల‌లిత (61) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అదే విధంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా తెలంగాణ రాష్ట్రం, జ‌న‌గామ జిల్లా, త‌రిగొప్పుల మండ‌లం, సోలిపురం గ్రామానికి చెందిన అర్జున్ చేవిటి (33) నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *