Breaking News

ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పదవ తరగతి ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22 సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ గేట్ వే హోటల్ లో విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో ఫలితాలను సులభంగా పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్‌ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎల్లుండి ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.
రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

వెబ్‌సైట్‌లో ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి:
టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయగానే ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
దాదాపు 6.3 లక్షల రెగ్యులర్‌ విద్యార్ధులతో పాటు మరో లక్ష వరకు ప్రైవేట్‌లో పరీక్షలు రాసిన వారు ఒకేసారి చెక్‌ చేసుకున్నా సర్వర్‌ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గ్రేడింగ్‌ ప్రక్రియను సైతం పూర్తి చేసి మార్కుల షీట్స్‌ను ప్రిపేర్‌ చేస్తున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్‌ టికెట్‌ నెంబర్‌ను పొందుపరిచి https://Results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు. మార్కుల మెమోను తాత్కాలికంగా ఈ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత పాఠశాలకు వెళ్లి మార్క్స్ మెమోను అధికారికంగా తీసుకోవాలి. మెమోలను పాఠశాలకు పంపడంలో ఆలస్యం కాకుండా ఫలితాల వెల్లడితో పాటు పార్శిల్‌ ప్రక్రియను సైతం చేస్తున్నారు. మార్క్స్ షీట్‌ గ్రేడ్స్‌గా ఉంటుంది. ఎక్కడా ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు పొందారో తెలియదు. కేవలం సబ్జెట్‌ వారీగా గ్రేడింగ్‌ మాత్రమే సర్టిఫికేట్​లో ఉంటుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *