రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రియల్ 27 వ తేదీన జిల్లాలో 11 కేంద్రాలలో పాలిటెక్నిక్ కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం డి ఆర్వో ఛాంబర్ లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు మాట్లాడుతూ, ఏప్రియల్ 27 న జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 నిర్వహిస్తున్నట్లు , ఈ పరీక్షలకు జిల్లాలో 5,844 మంది హాజరవుతున్నట్లు తెలిపారు.
ఆయా పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 నుంచి మ.1.00 వరకు, నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు గంట ముందుగా ఆయా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఇప్పటికీ హాల్ టికెట్స్ పంపడం జరిగిందన్నారు. పోలీసుల అధ్వర్యంలో పోలీసు బందోబస్తు, నగర పాలక సంస్థ అధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న త్రాగునీటి వసతి శానిటేషన్ , గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కేంద్రాలలో తాగునీటి వసతిసదుపాయాలు, శానిటేషన్ నిర్వహణా పంచాయతీ వ్యవస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వో ఆర్ ఎస్ ప్యాకెట్లు, తగిన మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలనీ, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చెయ్యాలని ఆర్బన్ తహసీల్దారు ను ఆదేశించారు.
ఈ సమావేశం ప్రిన్సిపాల్ బీ రవి, జిల్లా పంచాయతీ అధికారి డి. రాంబాబు, ఆర్ ఎం సి ఈ ఈ ఎస్ కే మదర్ షా ఆలీ, పోలిస్ ఎస్ ఐ కే. నాగేశ్వరరావు, ఏ ఈ విద్యుత్ ఏ. వేంకటేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ తరపున పి. జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News