Breaking News

పరీక్షకు గంట ముందుగా ఆయా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రియల్ 25 వ తేదీన ఎపి రెసిడెన్సియల్ స్కూలు అడ్మిషన్ టెస్టు మరియు ఎపి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కళాశాల కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు.

ఏపీ ఆర్ ఎస్ కాట్ 2024 , ఎపి ఆర్జేసి & డిగ్రీ సెట్ 2024 పై శనివారం డి ఆర్వో ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు మాట్లాడుతూ, ఏప్రియల్ 25 న ఏపీ ఆర్ ఎస్ కాట్ 2024 , ఎపి ఆర్జేసి & డిగ్రీ సెట్ 2024 పరీక్షలు రెండు సెషన్స్ లో నగరంలోనీ ఆరు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీఆర్ఎస్ కాట్ 2024 ఆరు కేంద్రాలలో ఉదయం 10 నుంచి మ.12.00 వరకు, నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండవ సెషన్ 3 కేంద్రాలలో ఎపి ఆర్జేసి & డిగ్రీ సెట్ 2024 మ. 2.30 నుంచి సా.5.00 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు గంట ముందుగా ఆయా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఇప్పటికీ హాల్ టికెట్స్ పంపడం జరిగిందన్నారు. పోలీసుల అధ్వర్యంలో పోలీసు బందోబస్తు, ఆర్ఎంసి త్రాగునీటి వసతి, శానిటేషన్ నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వో ఆర్ ఎస్ ప్యాకెట్లు, తగిన మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలనీ, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చెయ్యాలని ఆర్బన్ తహసీల్దారు ను ఆదేశించారు.

ఈ సమావేశం ప్రిన్సిపాల్ బీ రవి, ఆర్ ఎం సి ఈ ఈ ఎస్ కే మదర్ షా ఆలీ, పోలిస్ ఎస్ ఐ కే. నాగేశ్వరరావు, ఏ ఈ విద్యుత్ ఏ. వేంకటేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ తరపున పి. జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *