-రాజమండ్రి పార్లమెంటుకు , గోపాలపురం అసెంబ్లీ కి ఈరోజు నామినేషన్ దాఖలు కాలేదు.
-6 అసెంబ్లీ నియోజకవర్గలలో 09 నామినేషన్లు దాఖలు
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోనిశనివారం ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి నామినేషన్లు దాఖలు కాలేదని , మిగిలిన ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 09 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్యలేదని జిల్లా రిటర్నింగ్ అధికారి డాక్టర్ కే మాధవీలత తెలిపారు.
66- గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలో శనివారం ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చెయ్యలేదని తెలిపారు.
మిగిలిన ఆరు నియోజక వర్గాల వారీగా దాఖలు అయిన నామినేషన్ పత్రాలు వివరాలు..
040- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జై బీమ్ రావు భారత్ పార్డీ తరపున లింగం గంగాధర్
049- రాజానగరం నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రె ఆనంద కుమార్
050- రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ తరపున మేడా శ్రీనివాసరావు
051- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో
1) స్వతంత్ర అభ్యర్థి గా బొద్దాపు శివ విష్ణు ప్రసాదరావు,
2) భారత చైతన్య యువజన పార్టీ తరపున దుగ్గిరాల శ్రీదేవి,
054- కొవ్వూరు (ఎస్సీ ) నియోజకవర్గంలో
1) తెలుగుదేశం పార్టీ తరపున ముప్పిడి సుజాత,
2) వైఎస్సార్ సీపీ తరపున తలారి వెంకట్రావు 2 వ సెట్ నానినేషన్ దాఖలు చేసారు.
055- నిడదవోలు నియోజక వర్గంలో
1) భారతీయ ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ముక్కామల అన్నవర ప్రసాద్,
2) వైఎస్సార్ సీపీ తరపున గెడ్డం సుమలత,
3) వైఎస్సార్ సీపీ తరపున గెడ్డం శ్రీనివాస నాయుడు 2 వ సెట్ నానినేషన్ దాఖలు చేసారు.
Prajavartha Online Telugu News