Breaking News

పోలింగ్ ప్రక్రియ కు సన్నద్ధం కావాలి

-పొలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి
-హొమ్ ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ అందజేయాలి
-ఓ పీ వో, మైక్రో అబ్జర్వర్స్ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 22 నాటికి పూర్తి చెయ్యాలి
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగు సంబంధించిన కార్యచరణ ప్రణాళికా అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు.

శనివారం ఉదయం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ / డి ఈ వో కె. మాధవీలత మాట్లడుతూ నామినేషన్ దాఖలు సంభందించి నిర్దేశిత పత్రాలు సరి చూసుకుని, సింబల్ కేటాయింపులు, ఫారం 3 ఏ అప్లోడ్ చెసే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 85 ప్లస్, 40 శాతం పైబడిన దివ్యంగ ఓటర్లు కోసం హొమ్ ఓటింగు సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఫారం ” 12 డి ” సర్వే చేపట్టి , వారీ నుంచీ నిర్దారణ చేసుకోవడం జరుగుతొందని తెలిపారు. హొమ్ ఓటింగు సంబంధించి తక్కువ స్థాయిలో అంగీకారం తెలియ చేస్తున్న దృష్ట్యా ఆమేరకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకొని, కార్యచరణ నివేదిక అందజేయాలని ఆదేశించారు.

పొలింగ్ విధుల్లో ఉండే ఓ పి వో, మైక్రో అబ్జెర్వర్ లకి చెందిన పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఆర్వో ల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాలకు ఆయా ఎన్నికల సిబ్బంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డి డి వో లు అందరూ ఎన్నికల విధులను నిర్వర్తించే వారీ కార్యాలయ సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు వెళ్లి ఫారం 12 అందచెయ్యలని తెలియ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే అభ్యర్ధులు ద్వారా నామినేషన్లు దాఖలు ప్రారంభం అయిన దృష్ట్యా ఎన్నికల ఖర్చుల కింద క్షేత్ర స్థాయిలో బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలని మాధవీలత తెలియ చేశారు. ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, వి వి టి., తదితర బృందాలు క్షేత్ర స్థాయిలో జవాబుదారీతనం కలిగి విధులను నిర్వర్తించేలా రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణా చేయాలనీ కోరారు. ఇప్పటికే జిల్లాకు ఖర్చుల పరిశీలకుల రావడం జరిగిందనీ, క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తున్నారనీ పేర్కొన్నారు.  రానున్న రోజుల్లో  రాష్ట్ర స్థాయి సాధారణ, ఖర్చుల పరిశీలకులు, లా అండ్ ఆర్డర్ పరిశీలకులు, తదితరులు జిల్లాల పర్యటన లో భాగంగా రిటర్నింగ్ అధికారులు కార్యాలయాలని, చెక్ పోస్ట్ ల తనిఖీలకు రావడం జరుగుతుందన్నారు. అన్ని రికార్డులు నిర్వహణా, ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చెయ్యాలని, ఆమేరకు సిబ్బందినీ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్య వైఖరి చూపవద్దని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు , ఎలక్షన్ డిప్యూటి తహసీల్దార్ లు సునీల్ కుమార్, లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *