Breaking News

చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ట్వీట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అంకితమైన నేత అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా కొనియాడారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే విషయంలో తాను అంకితభావంతో ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు.

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన ఆయన నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నప్పుడూ ఆయన మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *