రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సెక్టార్ అధికారులకు, ఎన్నికల సిబ్బంది కు శిక్షణా కార్యక్రమము నకు ముఖ్య అతిథి జేసి, రూరల్ ఆర్వో ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు-2024 కి డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్ కేంద్రాలలో నిర్వహించవలసిన విధులు బాధ్యతల పై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఓటింగు సంబంధించిన ఈ వి ఎమ్ ల పని తీరు మీద శిక్షణ తరగతులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెక్టార్ అధికారులకు, అసెంబ్లి స్థాయి మాస్టర్ ట్రైనర్ (ALMTs) లకు , ప్రిసైడింగ్ అధికారులు, సహయ పీవో లకు, ఈ వీ ఎమ్ పనితీరు మీద పూర్తి అవగాహన ఉండాలని తెలియజేశారు.
కమిషనింగ్ ఆఫ్ ఈ వి ఎమ్, డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్స్ నందు జరుగు పని తీరుని వివరించి చెప్పడం జరిగింది . అధికారులు అందరికీ కూడా ఎటువంటి తప్పులు జరగకుండా పని చేయాలి అని సూచనలు ఇచ్చారు. ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకొవాలని, ఇందులో భాగంగా షర్ట్ వీడియో క్లిప్ కూడా అందజేసినట్లు తెలిపారు. ఒకటికి రెండుసార్లు లు పునశ్చరణ చేసుకోవాలి అని ఆదేశించారు..మాక్ పోల్ నందు అధికారులు పాటించాల్సిన నియమాలను వివరించారు. అధికారులు మరియు సిబ్బంది ఎవరికి కి కూడా ఉద్యోగ భాధ్యతలు నుండి మినహాయింపు ఇవ్వడం ఎట్టి పరిస్థితి లోనూ జరగదు అని ఖచ్చితం గా తెలిపారు. పి వో లు , ఏ పి వో లు రానున్న పోలింగ్ రోజున వారి పాత్ర ను వివరించి పాటించవలసిన జాగ్రత్తలు, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి పై తెలియజేశారు.
ఈ సమావేశంలో, డిప్యూటీ కలెక్టర్ ఐ. సాయి బాబు, రూరల్ తహసీల్దార్ వై. కె. వి. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News