విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలు వురు నాయకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఆకుల శ్రీనివాస్ కుమార్, నరహరశెట్టి శ్రీహరి, అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ బాషా, సంయుక్త కార్యదర్శు లుగా షేక్ మహమ్మద్ వహీద్, కంభం కొండల రావు, నిమ్మల జ్యోతి, పల్లెం రవి, ధనేయుల రామకాళేశ్వరరావు (కాళి), వెన్నం రత్నారావు, గుండే సుందర్ పాల్, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, చల్లా బ్రహ్మేశ్వరరావు, చంగంటి శ్రీనివాసరెడ్డి, మైల వరపు దుర్గాచిరంజీవి, పీతా మోహనరావు, వేదాంతం చైతన్య, కార్యవర్గ సభ్యులుగా ఎన్. ఎస్.రాజు, ఉమ్మడి ధనరాజ్, నిడదవోలు ఉద య్, తోకల శ్యామ్, ఎం. వెంగయ్య, గరికి ముక్కు రవికుమార్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మహిళా విభాగం కమిటీ సంయుక్త కార్యదర్శిగా వడ్లాని పూర్ణిమలత, రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ కార్యదర్శులుగా మేదర సురేష్ కుమార్, దాసి జయప్రకాష్ కెనడి, మేడా శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ కమిటీ కార్యదర్శులుగా బోను దుర్గానరేష్, బెజవాడ గణేష్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ కమిటీ కార్యదర్శిగా ఎస్.ప్రవీణ్ సజ్జన్ ప్రసాద్ నియమితులయ్యారు.
Prajavartha Online Telugu News