Breaking News

ప్రశాంతంగా జరిగిన ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు

-మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి 
-రాష్ట్ర వ్యాప్తంగా 31,376 మంది విద్యార్థులు హాజరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా 164 ఏపీ ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారని మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రమంతా 16,400 సీట్లకు ఉండగా, 36,079 మంది దరఖాస్తున్నారని, వారిలో 31,376 మంది (87%) హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల ఆదర్శ పాఠశాలను మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి రాష్ట్ర పరిశీలికులిగా, పర్యవేక్షకులుగా సందర్శించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యం, బందోబస్తు, మెడికల్ ఫెసిలిటీ వంటి వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతోపాటు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రత్ బేగం, సిరివెళ్ల ఎంఈఓ శంకర్ ప్రసాద్ హాజరు అయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *