పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీలోని 13వ డివిజన్ లో మంత్రివర్యులు జోగి. రమేష్ తనయుడు జోగిరాజీవ్ విస్తృతంగా గడపగడపకు వైఎస్ఆర్సిపి ప్రచారాన్ని నిర్వహించారు. . ఈ విషయంపై జోగి రాజీవ్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి స్వయం సహాయం సంఘాల మహిళలను గుర్తించి కేవలం ఒక యనమలకుదురులో 6000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు పేదరిక నిర్మూలన దిశగా ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత ఒక జగనన్నకే సాధ్యమని కావున రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ అష్రఫ్, లతీఫ్, కోసూరి నరేష్ కుమార్, వంకాయలపాటి ప్రవీణ్ కుమార్,. అనిల్ రెడ్డి ,ఇమ్రాన్ కరీం, ఈడే. గోపాలకృష్ణ సలీం చాముండేశ్వరి లంకా కోటేశ్వరరావు కర్ర శేషగిరిరావు గారు ఎర్ర నాంచారయ్య స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News