Breaking News

ఎన్నికల పరిశీలకులు కే. బాలసుబ్రమణ్యం, కమల్ కాంత్ సరోఛ్ లని కలిసిన కలెక్టర్ డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు వచ్చిన సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు కే. బాలసుబ్రమణ్యం, కమల్ కాంత్ సరోఛ్ లని స్ధానిక ఇరిగేషన్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు మంగళవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు.

సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా  తమిళనాడు కి చెందిన కే. బాలసుబ్రమణ్యం తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రీ అర్బన్, రాజమండ్రీ రూరల్ నియోజక వర్గాల పరిధిలో సాధారణ పరిశీలకులు గా వ్యవహరించనున్నారు. సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కమల్ కాంత్ సరోఛ్ కొవ్వూరు, నిడదవోలు , గోపాలపురం నియోజక వర్గాల పరిధిలో పరిశీలకులుగా వ్యవహరించనున్నారు .

గుజరాత్ కి చెందిన పోలిస్ పరిశీలకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు, నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గాని గుజరాత్ కేడర్ కి బలరామ్ మీనా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ స్వీకరణ ప్రక్రియ, ఈ వి ఎమ్ లను నియోజక వర్గాల పరిధిలోని తాత్కాలిక గోడౌన్ లకీ తరలింపు, పోలింగు సిబ్బందికి శిక్షణ, తదితర అంశాలపై కలెక్టర్ మాధవీలత వివరించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *