Breaking News

తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి గా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేసారు. వేలాది మంది కార్యకర్తలుతో కలిసి ర్యాలీ డప్పు వాయిద్యాలు, వివిధ కళాకారుల ప్రదర్శనలుతో ఉత్సాహభరితంగా సాగింది. రామలింగేశ్వర నగర్ కట్ట దగ్గర నుంచి కృష్ణలంక డిసిఎం గ్రాండ్ వరకు  ప్రదర్శన సాగింది. దారి పొడుగునా మహిళల హారతులు, దీవెనలతో  అవినాష్ ముందుకు వెళ్లారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తలు మధ్య ఘనంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చి వైసిపికి మద్దతు తెలిపారు. పది సంవ్సరాల పాటు ఎంఎల్ఏ గా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ అవుతుంది అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ ర్యాలీ విజయ యాత్ర లాగ సాగింది. మహిళలు ఆశీర్వాదం, పెద్దల దీవెనలతో విజయ యాత్రగా సాగింది. 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో మా సత్తా ఏమిటో చూపించామన్నారు. రీటైనింగ్ వాల్ నిర్మాణం తో పాటు, రోడ్లు, డ్రెయిన్లు, మెట్లు అభివృద్ది చేశామన్నారు. కృష్ణలంక ప్రజల చిరకాల కోరిక నెరవేర్చామన్నారు. టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ శవ యాత్ర లాగ సాగిందన్నారు. వైసిపి నామినేషన్ యాత్ర తూర్పు నియోజకవర్గo మాది అనే విధoగా సాగిందన్నారు. మీ కుటుంబ సభ్యుడుగా నన్ను దీవించండన్నారు. మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలో మీకు అండగా నిలిచానన్నారు. నాలుగు సార్లు మి గడప తొక్కి సమస్యలు పరిష్కారం చేసానన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా సేవ కార్యక్రమాలు చేశామన్నారు. గద్దె రామ్మోహన్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారన్నారు. తూర్పు ప్రజలకు సేవ చేయటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండన్నారు. జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నామినేషన్ ర్యాలీ లో పాల్గొన్న అందరికి దన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *