Breaking News

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలి…

-కొవ్వూరు, నిడదవోలు, గో పాలపురం అసెంబ్లి నియోజ క వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల కాంత్ సరోచ్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని కొవ్వూరు, నిడదవోలు, గోపాల పురం అసెంబ్లి నియోజ క వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ అన్నా రు. గురువారం నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో నిడద వోలు చెక్ పోస్ట్ ను, స్ట్రాంగ్ రూమ్ లను, ఆర్. ఓ స్వీకరించే నామినేషన్ల ప్రక్రియ విధానాన్ని ఆకస్మిక సందర్శన సమయంలో కమలకంత్ సరోచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం ని యోజక వర్గాల పరిధిలో చేసిన ఏర్పాట్లు, నామినేషన్ దాఖలు ప్రక్రియని పరిశీసిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఆర్ వీ రమణ నాయక్ మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలో చేపట్టిన కార్యచరణ ప్రణాళికా పై వివరించడం జరిగిందన్నారు. నామి నేషన్లు స్వీకరణ ప్రక్రియ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందనీ, అభ్యర్ధులకు వాటి పై అవగాహన కల్పించడం జరిగినట్లు తెలిపారు. అభ్యర్ధుల ప్రచారం, అనుమతులు, కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై సిబ్బంది కి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద, ఆర్. ఓ కార్యాలయం వద్ద రికార్డులను పరిశీలించి, సూచనలు చెస్తూ, తరచుగా తిరిగే వాహనాలపై నిఘా పెట్టామని ఆదేశించామని పేర్కొన్నారు.

నియోజక వర్గం లో ప్రత్యేక నామినేషన్ సెల్ (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేశామనీ రమణ నాయక్ వివరించారు. నామినేషన్లు దాఖలు చెసే విధానంలో ఎన్నికల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు నామినేష‌ న్లను స్వీక‌రించే గ‌ది లో వీడియో రికార్డు చేయడం జరుగుతోందన్నా రు. 55 నిడదవోలు అసెంబ్లీ నియో జకవర్గ నామినేషన్ల ప్రక్రియ పై ఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణ నాయక్ ను సాధారణ పరిశీ లకులు కమలకంత్ సరోచ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం. భాను ప్రకాష్, అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, బి. శ్రీనివాస్, లైజిన్ ఆఫీసర్, డి ఆర్. డి. ఎ, పి.డి, ఎన్. వి. వి. ఎస్ఎన్ మూ ర్తి, ఎఈఆర్ఓ లు వి. నాగభూషణం, కే నవీన్ కు మార్, డి.సుధ తదిత రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *