-బేషరతుగా తక్షణం విధుల్లోకి హజరు కావాలి
-యధాస్థితికి చేరుకున్న తర్వాత కార్మికుల సమస్య పరిష్కారం యాజమాన్యం చర్యలు తీసుకోవాలి
-జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించం
-కారకులైన ఇరువురిపై ఎన్నికల బైండోవర్ కేసులు నమోదు కలెక్టర్ మాధవీలత ఆదేశం
-కార్మికుల పక్షాన పోలీసులు నిలబడడం జరిగింది ఎస్పి జగదీష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల, యాజమాన్య ప్రతినిధులు తక్షణం బేషరతుగా సమ్మె విరమణ, లాక్ డౌన్ ఎత్తివేత పై పరస్పర అంగీకారంకు రావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , ఎస్పి పి జగదీష్ లు స్పష్టం చేశారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో పేపర్ మిల్లు కార్మిక, యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలిసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రాజమండ్రి పేపరు మిల్లు కార్మిక ఉద్యోగ సంఘాల తరపున ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచామన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. తక్షణం ఇరు వర్గాలు బేషరతు గా వ్యవహరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి కార్మికులకు ఎటువంటి మద్దతు, హమీ ఇవ్వడం జరుగలేదని, ఈరోజు జరిగిన సమావేశం సందర్భంలో వారూ ఆమేరకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల సందర్భంలో సమ్మె నిర్ణయం, యాజమాన్యం లా కౌట్ ప్రకటన నేపథ్యంలో బాధ్యుతులపై ఎన్నికల బై డోవర్ కేసులు నమోదు కి ఎస్పి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. బేషరతుగా సమ్మె విరమణ లాక్ డౌన్ ఎత్తివేత పై సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి మాత్రమే వెళ్లాలని మాధవీలత పేర్కొన్నారు. 20 నుంచి 25 రోజుల్లో పేపర్ మిల్లు కార్యకలాపాలు, ఉత్పత్తి యధాస్థితికి చేరుకున్న వెంటనే కార్మిక సంఘాలతో వారీ డిమాండ్ల పరిష్కారం కోసం యాజమాన్యం బేషరతుగా చర్చలకు పిలిచి వారీ తరపున అంగీకారం తెలియ చేసే క్రమంలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. అదే విధంగా కార్మికులు కూడా కంపెనీ ఉత్త్పత్తి సాధారణ స్థాయి కి చేసుకునేలా తోడ్పాటు అందజేయాల్సి ఉంటుందన్నారు. మిల్లుపై ప్రత్యక్షంగా ఆధారపడ్డ 3 వేలకు పైగా కార్మిక కుటుంబాలు, పరోక్షంగా మరింత మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అభివృద్ధి కూడా ముఖ్యం అన్నారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించె ప్రసక్తి లేదు అని పేర్కొన్నారు. ఈరోజు ఇరుపక్షాలు హాజరై పరస్పర అంగీకారం రావడం జరిగిందనీ, ఇప్పటి వరకూ వేచి చూసే దోరణిలో అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం కఠిన వైఖరి వ్యవహరించడం తప్పనిసరి అని మాధవీలత తెలిపారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీ. జగదీష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఏప్రియల్ 2 వ తేదీ నుంచి సమ్మెకు వెళ్ళడం శాంతి భద్రతల పరిరక్షణ కి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లు తెలియ చేశారు. ఇప్పటి వరకు కార్మికుల పక్షాన పోలీసులు, జిల్లా యంత్రాంగం నిలబడడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే పలు మార్లు సంప్రదింపులు జరిపి, వారీ న్యాయమైన డిమాండ్ అమలు చేసేలా మద్దతుగా నిలిచిన విషయం ప్రస్తావించారు. జిల్లాలో ఎన్నికల పరిశీలకులు వొచ్చి ఉన్నారని, ప్రస్తుతం బేషరతుగా సమ్మె విరమణ చేసి, పరిశ్రమ ఉత్పత్తి యధాస్థితికి చేరుకునేలా కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. సమ్మె లో వెళ్లిన కార్మికులు తిరిగి విధులకు హాజరు అయ్యే క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకొరదని తెలిపారు.
జాయింట్ కార్మిక కమిషనర్ ఏ. రాణి మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ది ద్వారా సమాజ నిర్మాణానికి, ఉపాధి అవకాశాలు కల్పన కు అవకాశాలు ఉంటాయని, పరిశ్రమ ఉత్పత్తి యధాస్థితికి చేరుకున్న తర్వాత యాజమాన్యం తో కార్మికుల డిమాండ్ పై చేర్చలకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బే షరతు గా సమ్మె విరమణ చేసి, జిల్లా ఎన్నికల ప్రక్రియకు సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కార్మిక కమిషనర్ ఏ. రాణి, సహయ లేబర్ కమిషనర్ ఏ ఎస్ ఎల్ వలీ, డిఎస్పీ రామకృష్ణా, యాజమాన్య ప్రతినిధులు వి. శ్రీనివాస్, జి. గణేష్, ఎస్. విజయ కుమార్, కార్మిక సంఘం ప్రతినిథులు సిఐటియూ ఎస్. వేంకటేశ్వర రావు, ఎ ఐ టి యు సి ఏ. సత్యనారాయణ, ఐ ఎన్ టీ యూ సి జె వై దాసు స్టాఫ్ వర్కర్ సంఘం కే. రాజేష్, బీ. మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News