విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బజాజ్ 3 వీలర్స్ వారి అధీకృత డీలర్ వరుణ్ బజాజ్ సరికొత్త షోరూం మరియు వర్క్ షాప్‌ని ఆటోనగర్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన విజయవాడ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర షోరూంని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ ఆటోనగర్ కస్టమర్లకు చేరువలో ఆధునిక హంగులతో సరికొత్త బజాజ్ 3 వీలర్ షోరూం & వర్క్‌షాప్‌ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాక బజాజ్ 3 వీలర్ రంగంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ ఆటోలని ఆవిష్కరించడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. బజాజ్ వారి సరికొత్త ఆర్‌ఇ ఇ-టెక్ 9.0 మరియు ఎక్స్టెల్ కార్గో ఇ-టెక్ 12.0, ఎలక్ట్రిక్ 3 వీలర్లను నేడు విజయవాడలో ఆవిష్కరించారన్నారు. సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలలో ఐపీ67 రేటెడ్ అడ్వాన్స్డ్ లై-అయాన్ బ్యాటరీ, టూ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మరియు అత్యంత సమర్థవంతమైన పర్మినెంట్ మ్యాగ్నెట్ సిక్రోనస్ (పిఎంఎస్) మోటార్లను పొందుపరిచారన్నారు. ఆర్‌ఇ ఇ-టెక్ 9.0 మరియు ఎక్స్టెల్ కార్లో ఇ-టెక్ 12.0లలో 11.8 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 178 కి.మీ. రేంజ్ మరియు 183 కి.మీ రేంజ్ మైలేజ్న (అరాయ్ సర్టిఫికేషన్ ప్రకారం) ఇస్తుంది. ఎక్స్ షోరూం ధర రూ.3,65,419 నుండి రూ.4,49,601గా నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా బజాజ్ ఆటో లిమిటెడ్, ఐబియు రీజినల్ మేనేజర్ సేల్స్ ఆర్.కేశవమూర్తి, రీజినల్ మేనేజర్ సేల్స్ ఆర్.కార్తికేయన్, మరియు రీజినల్ మేనేజర్ సర్వీస్ బి.చంద్ర శేఖర్, వరుణ్ బజాజ్ డైరెక్టర్ పి.సత్య నారాయణ హాజరయ్యారు.
Prajavartha Online Telugu News