Breaking News

సుందరమ్మ స్కూల్ ను తీర్చి దిద్దుతాం…

-డివిజన్ ప్రచారంలో సుజనా కుటుంబం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కే ఎల్ రావు నగర్ లోని సుందరమ్మ స్కూల్ ను వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారయణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కే ఎల్ రావు నగర్ లో సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్ నీ సందర్శించారు. స్కూల్ పరిస్థితుల గురించి ఆరా తీశారు. స్కూల్ ను అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అధ్వాన్నంగా ఉన్న మార్కెట్ ను ఆధునీకరిస్తామని చెప్పారు. టేనర్ పేట తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కే నాగమల్లేశ్వరరావు, నాగోతి రామారావు, బాయణ హేరంబ కుమార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *