విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్,ఏపీఐఐసీ కాలనీ ప్రాంతాలలో దేవినేని క్రాంతి గారు,12వ డివిజన్,యార్లగడ్డ అప్పారావు స్ట్రీట్,కాకతీయ బజార్,అశోక్ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర గారు మరియు కేశినేని హైమ గారు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బరావు,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్ మరియు డివిజన్ అధ్యక్షులు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News