విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 99 శాతం పైగా అమలు చేశాం కాబట్టే దమ్ముగా ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్,ఎన్టీఆర్ సర్కిల్, పిటింగుల పేట, శ్రీ రామ నగర్ కాలనీ,సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్ ప్రాంతాలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు వెళ్లిన అవినాష్ ప్రభుత్వం చేసిన మంచిని చూసి ఫ్యాన్ గుర్తుకు రెండ్లు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే రాష్ట్రంలో సంక్షేమభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగాయని అందుకే ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలియజేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే, ఎంపీ,మేయర్, కార్పొరేటర్ అందరూ ఆ పార్టీ వారు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని విమర్శించారు. కానీ నేడు మాకు ఏ పదవులు లేకపోయినా చిత్తశుద్ధితో అభివృద్ధి చేసి చూపించామని ఈ ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వలని అభ్యర్ధించారు. నిన్న ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఖచ్చితంగా అమలు చేసే వాటినే జగన్ ప్రకటించారు అని, ప్రతిపక్ష టీడీపీ వారి లాగా మోసం చేసే హామీలను ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ముందు గద్దె ఫొటోలకు పోజులిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజల మద్దతు తో ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News