విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకట మహేష్ 22 డివిజన్లలోని తనను అనుసరించే నాయకులు క్యాడర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో మరొకమారు ముఖ్యమంత్రి అవుతారని, పశ్చిమ వైసిపి అభ్యర్థి ఆసిఫ్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నానిల గెలుపు కోసం బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైయస్సార్సీపి పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ గుబ్బ చంద్రశేఖర్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ… నవరత్నాల 100% అమలు చేసి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోను విడుదల ద్వారా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యంమని, దేశంలోనే ఆదర్శవంతమైన యువ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ని, ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. కళ్ళుండి చూడలేని కబోధులకి అభివృద్ధి కనపడదని,జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే సీఎం పై విజయవాడలో దాడి చేసిన కోటమని విజయవాడ నగర ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని, నగరాల సామాజిక వర్గ 40 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, 10 సంవత్సరాలకు పైగా పోతిన మహేష్ కష్టాన్ని పచ్చ నోట్లు ఇచ్చి దోచుకున్న సజనా చౌదరి పచ్చ నోట్ల కోసం అమ్ముకున్న పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని గ్రహించండి ఓటుతో మీ బుద్ధి చెప్పండి, పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ప్రజాబలం ముందు కూటమి ధనబలం నిలవలేదని, రాబోయే ఎన్నికల్లో పశ్చిమాన అసెంబ్లీకి ఆసిఫ్ ,ఎంపీగా కేసినేని నాని భారీ మెజార్టీతో గెలుస్తారని, పశ్చిమాన 22 వార్డుల్లో నా క్యాడర్ బలంగా ఉంది నాతోనే ప్రయాణం చేస్తున్నారు. పదిమంది డివిజన్ అధ్యక్షులు నలుగురు డివిజన్ సమన్వయకర్తలు మిగతా అన్ని డివిజన్లో కేడర్ పోతిన మహేష్ అడుగుజాడల్లో నేను నడుస్తారు వైసీపీ గెలుపులో భాగస్వామ్యం అవుతారనిసామాన్యుల కష్టాలు సామాన్యుడికే తెలుస్తాయి బెంజ్ కారులో తిరిగే వాళ్ళకి ఎలా తెలుస్తాయని, పశ్చిమాన ఫ్యాను దెబ్బకి కమలం వాడిపోతుంది ఓడిపోతుందనిడబ్బు అహంకారంతో పశ్చిమ నియోజకవర్గంలో అడ్రస్ లేని సృజనా చౌదరి లాంటి వ్యక్తి కులాలని కొంటున్నారని విర్రవీగుతున్నారు. పశ్చిమ ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని, ప్రజలారా ప్యాకేజీ తీసుకునే స్థానిక నాయకులను నమ్మద్దు వాళ్ళు పేద సామాన్య ప్రజల కష్టాల మీద రాజకీయ వ్యాపారం చేస్తున్నారు ఏనాడు మీ సమస్యలు పరిష్కరించలేదు కుల, మత సంఘాల పేరుతో ఏదో ఒక కార్డుని అడ్డం పెట్టుకొని క్యాష్ కొట్టేస్తున్నారని అన్నారు.
Prajavartha Online Telugu News