తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, ఏప్రిల్29: నేటి సోమవారం సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ గారు శ్రీకాళహస్తి మరియు సత్యవేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహణలో భారత ఎన్నికల కమిషన్ వారి నిర్దేశాలకు లోబడి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించాల్సి ఉంటుందని, ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో సజావుగా జరిగేలా అందరు సహకరించాలని సూచించారు. అలాగే నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాల, తమిళ స్కూల్ నందు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. జడ్పీ హైస్కూల్, ఎంపీపీ పాఠశాల పిచ్చాటురు, ఎంపీపీ పాఠశాల జడ్పీ ఉన్నత పాఠశాల నాగలాపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వీరి వెంట సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News