విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా సర్కిల్ వన్ కార్యాలయంలో జరిగిన మొబైల్ కోర్ట్ లో నమోదైన 25 కేసులు కార్పొరేషన్ కోర్ట్ న్యాయమూర్తి బి.విజయ్ కుమార్ రెడ్డి, సర్కిల్ వన్ పరిధిలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 25 కేసులపై విచారణ జరిపి రు 14730/- జరిమానా విధించారు. ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ రోడ్లపై చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన రోడ్డుపై పెంపుడు జంతువుల్ని ఉంచిన లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోడ్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని హెచ్చరించారు. ఒకసారి జరిమానా విధించాక రెండోసారి కూడా అదే తప్పు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్-1 డాక్టర్ సురేష్, 38,39,42,44,51,52 సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సెక్రటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News