విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ నిరాహార నిరసన దీక్ష చేపట్టి గాంధీజీ కి నివాళులు అర్పించారు. మంగళవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మీడియాతో మాట్లాడుతూ నేటి యువతతో పాటు అందరికీ తెలియాలని గుర్తు చేస్తూ మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన 30వ తేదీని పురస్కరించుకొని దానికి నిరసనగా కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార నిరసన దీక్ష ఇప్పటికీ చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం వెంటనే అమలు చేస్తేనే ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటినుండే దేశవ్యాప్తంగా, అలాగే రాష్ట్రంలోనూ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తాను ఎన్నికలు కమిషన్ కు గతంలో లేఖ రాయడం జరిగిందన్నారు. అయితే తన సూచనను పరిగణన లోకి తీసుకోపోవడం దారుణమని అన్నారు. కేవలం పోలింగ్ తేదీకి ముందు వెనక రోజుల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడం వల్ల ఆశించిన ఫలితం రాదన్నారు. మద్యపానం వల్ల దేశంలో కోట్లాది కుటుంబాలు నాశనం అవుతున్నాయని గాంధీ నాగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News