Breaking News

వైసీపీ లోకి భారీ చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీ, జనసేన నాయకులు ఆయా పార్టీలను వదలి వైసీపీ లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలతో ఆ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు . 16వ డివిజన్ విజయవాడ అర్బన్ కాపునాడు ప్రధాన కార్యదర్శి,జనసేన నాయకులు పోతురాజు శ్రీనివాసరావు నాయకత్వంలో 100 కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినాయకత్వంకు మద్దతు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేయడానికి ముందుకు రాగా వారందరికి అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమలతో ప్రజల్లో తిరుగులేని ఆదరణ లభిస్తోంది అని, ప్రతిపక్ష పార్టీల సభలకు, ర్యాలీ లకు జనాలు రాక పక్క నియోజకవర్గల నుండి డబ్బులిచ్చి మరి తరలించే పరిస్థితి ఏర్పడింది అని ఎద్దేవా చేశారు. ఇటీవల క్రిష్ణలంక, పటమట ప్రాంతాల నుండి కూడా ప్రతిపక్ష పార్టీలలో గౌర్వపదమైన పదవులలో ఉన్న నాయకులు కూడా వైసీపీ పార్టీలో చేరడం తో మా బలం మరింత పెరిగిందని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, కొత్తపాత నాయకుల సమన్వయం తో ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *