Breaking News

ప్రజలు తమకు జరిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వైసీపీని ఆశీర్వదించాలి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసే పనులను చీదరించుకుంటున్నారని నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నిత్యం నిరాధార ఆరోపణలతో ప్రజల ముందుకు వస్తున్నాడని చెప్పారు.. నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్లు పార్కులు కమ్యూనిటీ హాల్స్ రిటైనింగ్ వాల్ నిర్మించింది తామే అని ధైర్యంగా చెప్పగలమని అన్నారు. నియోజకవర్గ ప్రజలు గద్దె రామ్మోహన్ కు ఈసారి ఎన్నికల్లో బాయ్ బాయ్ చెప్పడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కృష్ణలంక 21వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పుప్పల కుమారి తో కలిసి ఆర్చ్ రోడ్డు నుంచి ప్రారంభమై తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించామని చెప్పారు.. ప్రజలు తమకు జరిగిన లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వైసీపీని ఆశీర్వదించాలని కోరారు.. టిడిపి నేతలకు కృష్ణలంక ప్రాంతం అంటే చిన్న చూపు ఉండేదని కానీ వైసీపీ హయాంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేసి రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత వైసిపి ప్రభుత్వంది అని చెప్పారు.. ప్రజల వద్దకు వెళుతుంటే రోడ్లు, డ్రైన్లు, లైట్లు, కొండ ప్రాంతంలో మెట్లు, పార్కుల అభివృద్ధి, కమిటీ హాల్స్ నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మించారని ప్రజలు సంతోషంగా చెప్పడం తమకు ఆనందం కలిగిస్తుంది అన్నారు.. కృష్ణలంక ఏపీ ఎస్ ఆర్ ఎమ్ స్కూల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేశామని ఆయన చెప్పారు.. కరకట్ట ప్రాంతంలో పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచినీటి కష్టాలు తీర్చింది వైసిపి హయాంలోనని గుర్తు చేశారు.. డివిజన్లో 90 కోట్ల సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ దని కొనియాడారు.. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసాము కాబట్టి దమ్ముగా ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నామని టిడిపి నేతలు ఏమి చేశారో చెప్పుకోలేక దాక్కుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. టిడిపి నేతలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని అన్నారు.. ఫీడర్ రోడ్డు మూసివేస్తున్నారని గద్దె రామ్మోహన్ కి సమాచారం అందిస్తే గతంలో స్థానిక ప్రజలను అవమానించిన చరిత్ర అతనిది అని చెప్పారు.. మూడవ డివిజన్లో రోడ్ల మరమ్మత్తుల పనులు జరుగుతుంటే వాటిని అడ్డుకున్న వ్యక్తి గద్దె అనురాధ అని చెప్పారు.. అభివృద్ధి జరగడం లేదంటారు జరుగుతున్న పనులను ఆపేది వాళ్లే అని విమర్శించారు.. ప్రజలపై ఎందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు..ఏం మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతారని మీరు అభివృద్ధి పనులు ఆపిన ప్రదేశంలో మీరు తిరగగలరని నిలదీశారు.. 674 కోట్లతో అభివృద్ధి పనులు చేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మీరు చెబుతున్న 2000 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.. డొల్ల కబుర్లు చెప్పడం ఇప్పటికైనా గద్దె రామ్మోహన్ ఆపాలని కోరారు.. 2000 కోట్ల అభివృద్ధి పనులు ఎక్కడ ఉన్నాయో కనబడవు ఆ డబ్బులు ఏమైపోయాయి కూడా తెలియదు అన్నట్లు గద్దె రామ్మోహన్ వ్యవహరిస్తున్నాడని చెప్పారు.. గద్దె రామ్మోహన్ కు బాయ్ బాయ్ చెప్పేందుకు తూర్పు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి,డివిజన్ అధ్యక్షులు టి.పి రెడ్డి ,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *