కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు సతీమణి వసంత శీరిష ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం స్థానిక మహిళలు పార్టీ నాయకులు, అభిమానులతో కొండపల్లి లోని 28వ డివిజన్ ఇందిరా నగర్ లో వసంత శిరీష ఇంటింటి ప్రచార కార్యక్రమం కోనసాగింది. వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అత్మీయంగా పలకరిస్తూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి గా కేశినేని శివనాథ్ ని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మహిళలు శాలువా కప్పి హరతులు పట్టి అత్మీయంగా స్వాగతం పలికి మేము సైతం అంటూ వారు కూడా ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లో జనసేన వీర మహిళలు తెలుగు మహిళలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News