Breaking News

ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికే పోటీ చేస్తున్నా… : పేరం శివ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, నేషనల్ సెక్రెటరీ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ… జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వారు నాకు గుర్తుని కేటాయించారు. పువ్వుల బుట్ట గుర్తుపై పోటీ చేయుచున్నాను. ఆ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణా నది జలాలపై ఇక్కడున్నటువంటి జరిగే సమస్యలపై పార్లమెంట్లో ఒక సైంటిఫిక్ రూట్లో పోరాటం చేయాలంటే విజయవాడలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు 17 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. నన్ను గెలిపించాలని నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల సమస్యలపై పోరాటం చేసే అవకాశం వస్తుందని, అందరికీ నా పేరుపేరునా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నను అని, ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నిర్మాణం చేసిన పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఈ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నానని, మీకు మరొకసారి తెలియజేస్తున్న ముఖ్యంగా ఈ రోజున రాబోయే భవిష్యత్తు కూడా నేను ఒక నిర్ణయం అనేది అందరికి తెలియజేస్తున్న భగవంతుడు మనకి అమ్మవారి సాక్షిగా, మనకి కృష్ణ జలాలు ఉన్నాయి. ఈరోజున కృష్ణా నదిపై నీరు సరిగా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. నేను గత పది సంవత్సరాల క్రితమే ప్రమాదం పసిగట్టి మనకు వచ్చే వర్షాకాలంలో వచ్చే నీరు కొన్ని లక్షల క్యూసెక్కులు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. దానివల్ల తాగునీరు, సాగునీరు లేక, జంతువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి రాజకీయాన్ని చూడలేదు, వ్యాపారపారం చేశారు. దానివల్ల పార్లమెంట్లో గాని, అసెంబ్లీలో గాని మాట్లాడే వారు లేరు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా లేరు. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలయింది. ప్రత్యేక హోదా అని చెప్పి వైఎస్ఆర్సిపి గాని, తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని ప్రబోవాలు చేసి ఓటు వేపించుకొని అధికారంలోకి వస్తున్నారు. పార్లమెంటు లో ఒక్క సమస్య పై కూడా మాట్లాడటం లేదు. ఇక్కడున్నటువంటి పేద ప్రజలు నష్టపోతున్నారు. జగ్గయ్యపేట నుంచి అవినిగడ్డ వరకు, కృష్ణ నదిపై చెక్కు డ్యామ్ నిర్మాణం చేసుకుంటే రాబోయే తరానికి మార్గం చేసుకుంటాం.
తాగునీరు అన్నిటి కూడా ఇది అవసరం ఉన్నది. దానివల్ల నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేవలం ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అని అన్నారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *