Breaking News

చంద్రబాబూ అవ్వతాతలపై ఎందుకింత కక్ష… : మంత్రి ఆర్కేరోజా

-నీ వయస్సున్న వృద్దులను కష్టపెట్టడంలో నీకెందుకింత ఆనందం
-ఒక్కరోజు నువ్వు వారిలా ఎండలో నిలుచుంటే కష్టాలు నీకు అర్థమయ్యేది

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు పన్నాగంతో పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తకంగా అవ్వాతాతలు పడే నరకయాత మనసును ద్రవింపజేస్తోందని మంత్రి ఆర్కేరోజా అన్నారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 58 నెలలు లేని కష్టాలు నేడు అవ్వాతాతలు, దివ్యాంగులు పడాల్సివస్తోందన్నారు. ఉదయం ఐదు గంటలకే పెన్షన్‌ ఇంటికే వెళ్లి ఇప్పించే జగనన్నను చూసి అవ్వతాతలు నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోయారన్నారు. వృద్దులపై కన్నెర్ర చేశాడన్నారు. కక్షకట్టి తన అనుచరులైన నిమ్మగడ్డ రమేష్, అచ్చన్నాయుడుతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించి వలంటీర్లను పెన్షన్‌ పంపిణీ నుంచి తొలగించారన్నారు. బ్యాంకుల్లోను, సచివాలయాల్లోను పెన్షన్‌ ఇచ్చే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. 45 డిగ్రీల ఎండలో వృద్దులు బ్యాంకుల వద్ద పడే అవస్థలు పడటం, అక్కడక్కడా మరణించడం చూసి బాధతో కల్లు చమర్చుతోందన్నారు. చంద్రబాబుకు తన వయస్సులో ఉన్న వృద్దులు పడుతున్న కష్టాలు చూసినా కనికరం లేదన్నారు. అలా చంద్రబాబు ఒకరోజు ఎండలో నిలిస్తే వారి కష్టాలు అర్థమౌతుందన్నారు. పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన రోజే ఆయనకు కనికరం లేదని నిరూపితమైందన్నారు. అందుకే రాష్ట్రంలో ఎవరూ ఆయనను ఇష్టపడటం లేదన్నారు. జగనన్న పాలన ఉంటేనే ప్రతి ఒక్కటి ఇల్లు వెతుక్కుంటూ వస్తుందన్నారు. ఇంతచేసి ఓట్లడగడానికి వచ్చే కూటమి నేతలను చొక్కాపట్టుకొని నిలధీయండని, తరిమి తరిమి కొట్టండని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *