Breaking News

రోజాకు ఏఎంకే పార్టీ మ‌ద్ద‌తు…

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణికి అన్నా మ‌క్క‌ల్ క‌చ్చి పార్టీ (ఏఎంకే) సంపూర్ణ మ‌ద్ద‌తును గురువారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆ పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం ఆధ్వర్యంలో మంత్రిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఆమెను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల‌లో అభివృద్ది చేశార‌ని, మ‌రోసారి ఆమె ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని, తిరిగి మంత్రిగా కొలువు తీరాల‌ని పార్టీ చీఫ్ ఇవి క‌న్నాయ‌రం కోరారు. త‌న‌కు పార్టీ ప‌రంగా సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేసినందుకు ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సంతోషం వ్య‌క్తం చేశారు. పార్టీ బాధ్యుల‌కు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు. అంద‌రి ఆద‌రాభిమానాల‌తో తాను గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సంక్షేమ ఫ‌లాలు ప్ర‌తి ఒక్క‌రికీ అందేలా చేయ‌డంలో తాను స‌క్సెస్ అయ్యాన‌ని చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *