Breaking News

ఉయ్యూరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

-హోం వోటింగ్ వేగవంతం గావించాలి

పెనమలూరు, ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం పెనమలూరు నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ పరిశీలించి ఈవీఎం కమిషనింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ లో బందరు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం, కంట్రోల్ యూనిట్ లో అభ్యర్థులు వారి గుర్తులు లోడ్ చేయడం వాటికి సీల్ వేయడం వంటి కార్యక్రమాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ డి రాజు పెనమలూరు నియోజకవర్గంలో ఈవీఎం కమిషనింగ్ వివరాలు కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ ఉయ్యూరులో పిడబ్ల్యుడి ఓటర్ ఐలూరి నాగరాజు ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, బ్యాలెట్ నెంబర్, వోటర్ సీరియల్ కరెక్ట్ గా వేయాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 85 ప్లస్ వయస్సు గలవారు దివ్యాంగులు, పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని, ఈ సౌకర్యాన్ని వారు సక్రమంగా వినియోగించుకునేలా హోం ఓటింగ్ బృందాలు కృషి చేయాలన్నారు.

ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ఈ వెంకటేశ్వరరావు పెనమలూరు నియోజకవర్గ పరిధిలో హోం ఓటింగ్కు అర్హత గల 379 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారి ఇంటి వద్దనే హోం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్కు తెలిపారు.

ఓటర్ల వద్దకు వెళ్లే ముందుగా హోమ్ ఓటింగ్ బృందం సభ్యులు సంబంధిత ఫారాలు డిక్లరేషన్లు అన్ని సిద్ధం చేసుకుని హోమ్ ఓటింగ్ వేగంగా జరిగేలా చూడాలని కమిషనర్ కు కలెక్టర్ సూచించారు.

ఉయ్యూరు తాసిల్దారు ఎన్. గురుమూర్తి రెడ్డి, హోమ్ ఓటింగ్ బృందంలో పివో పి. వి. రమణ, మైక్రో అబ్జర్వర్ ఏ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *