Breaking News

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు విజయదుంధుబి

– సూపరింటెండెంట్ ఎస్ రాహుల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు అత్యుత్తమ ఫలితాలు సాధించటం ఎంతో ఆనందమని జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ పేర్కొన్నారు. గురువారం ఆయన సెంటర్ జైల్లో పాసైన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పదవ తరగతి , ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరి ఖైదీలు సురేష్ కుమార్, మాణిక్యం లను సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్ . రాహుల్ మాట్లాడుతూ , తొట్ట తొలిసారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి 48 మంది ఖైదీలు ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరు కాగా , వారిలో 39 మంది పాసయ్యి 81 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియట్ నుండి 12 మంది పరీక్ష రాయగా 11 మంది పాసై 92 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రెండు విభాగాల ఫలితాల్లో 90 శాతం ఫస్ట్ క్లాసులు సాధించటం విశేషం అన్నారు. అలాగే గత ఏడాది డిగ్రీ పరీక్షల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీకి రెండు బంగారు పథకాలు రావడం కూడా జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు.

ఖైదీలు జైల్లో తమ సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ప్రవర్తన మార్చుకుంటూ విడుదలైన తర్వాత సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని, జైల్లో నేర్చుకున్న వృత్తులతో మంచి జీవనోపాధి గడపాలని రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ యం. రాజకుమార్ ని, చదువుకు ప్రోత్సహిస్తున్న జైలర్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు, ఎం ఏ శర్మ, వార్డర్ శంకర్రావు లను ఆయన అభినందించారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ యం. రాజకుమార్ మాట్లాడుతూ టైలరింగ్, వెల్డింగు, ప్లంబింగ్, చేనేత, గార్డెనింగ్ వంటి అనేక వృత్తుల్లో ఖైదీలకు శిక్షణ చక్కగా జరుగుతోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఖైదీలు మంచి జీవితాన్ని గడపాలని కోరారు. ఖైదీలు వేసవి తాపానికి గురికాకుండా బేరక్ ల రూఫ్ లకు కూల్ పెయింటింగ్, కిటికీలకు చల్లని తెరచాపలు, చల్లని కుండనీళ్లు, పంకాల సదుపాయం ఏర్పాటు చేశామని తెలిపారు. జైలు విద్యార్థులందరికీ స్వీట్లు పంచారు.

ఈ కార్యక్రమంలో జైలు సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు, జైలర్లు సిహెచ్ రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *