Breaking News

జిల్లాలో హోం ఓటింగు ప్రక్రియ ప్రారంభం

-జిల్లాలో 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బృందాలు, 400 సిబ్బంది నియామకం
-జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు
-అంగీకారం తెలిపిన 85 ప్లస్ ఓటర్లు 648 , పి డబ్ల్యూ డి ఓటర్లు 658 మంది
-కలెక్టర్/డి ఈ వో మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించునేలా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలలో భాగంగా జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె..మాధవీలత తెలిపారు.

గురువారం స్థానిక దానవాయి పేట ప్రాంతంలో హోం ఓటింగు ప్రక్రియ కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ దినేశ్ కుమార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 8283 మంది, నలభై శాతం పైబడిన దివ్యాంగ ఓటర్లు 19718 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారిలో జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 648 మంది , దివ్యాంగ ఓటర్లు 735 మంది ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఫారం 12 ద్వారా తమ ఆమోదం తెలియ చేసారన్నారు. జిల్లాలో   హొమ్ ఓటింగు కోసం తూర్పు గోదావరి జిల్లాలో మే 2 వ తేదీ, మే 8 వ తేదీ లలో హోం ఓటింగు కోసం ఓటర్ల ఇంటింటికీ పంపడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం 400 మంది ఉద్యోగులు, పోలీస్ లతో కూడిన 69 బృందాలు విధుల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈరోజు అన్నీ ఇళ్ళు సందర్శించి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. ఒక వేళ ఓటరు ఈరోజు అందుబాటులొ లేని ఎడల మే 8 వ తేదీన ఓటు హక్కును వేసేలా మరో సారి ఇంటింటికీ వెళతారన్నారు. ఆరోజు కూడా ఓటు వెయ్యని ఎడల ఓటు వేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. కావున హోం ఓటింగు కోసం ఫారం 12 అందచేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజమండ్రీ సీటి అసెంబ్లి నియోజక వర్గం లో 85  ప్లస్ ఓటర్లు 142 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు  65 మంది  కోసం 10 హొమ్ ఓటింగు  బృందాలు , సిబ్బంది 40 మంది నియమించామని ఆర్వో కే. దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్, రాజమండ్రీ అర్బన్ అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్, సెక్టరాల్ అధికారులు, హోం ఓటింగు బృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *