-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్ కి తావు లేకుండా పారదర్శక నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయండి: భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్
-జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేపడుతున్నారు: తిరుపతి పార్లమెంటరీ ఎన్నికల సాధారణ, పోలీస్ మరియు వ్యయ పరిశీలకులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమిషన్, న్యూ ఢిల్లీ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ గారు 4 వ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, పార్లమెంట్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఎక్స్పెండిచర్, ఎన్నికల కమిషన్ నుండి జిల్లాలకు కేటాయించబడిన ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి 23 -పార్లమెంట్ నియోజక వర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు వి.జి శేషాద్రి, మీను ఓలా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈసిఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా రీ పోల్ కు తావు లేకుండా పారదర్శక నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకం అని, వారికి ఈవిఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ ప్రక్రియ లో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లో స్పష్టంగా ఉన్నాయని ఆ మేరకు అవగాహన కలిగి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపం ద్వారా రీపోల్ కు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవిఎం వినియోగం, రీప్లేస్మెంట్ కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందని ఆ మేరకు మాత్రమే చర్యలు ఉండాలని తెలిపారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోల్ ఘటనలకు తావివ్వకుండా ఎన్నికల మార్గదర్శకాల మేరకు అందరూ కలిసి కట్టుగా కృషి చేసి ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జాగ్రత్తగా స్ట్రాంగ్ రూం నందు భద్ర పరచాలని, వీడియోగ్రఫీ ఉండాలని, ఎన్నికల సామాగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలని అన్నారు. పోలింగ్ కి 72 గం. ల ముందు నగదు, మద్యం, ఉచితాల పంపిణీ వంటివి జరగకుండా నిఘా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, త్రాగు నీరు తదితర మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు, నీడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తిరుపతి జిల్లా నుండి ఉజ్వల్ కుమార్ ఘోష్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత గా ఉన్నారని తెలిపారు. పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే వివరిస్తూ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయని స్వయంగా పరిశీలించానని తెలుపుతూ ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తదితర ఏర్పాట్లు నిబంధనల మేరకు ఉన్నాయని, సెక్యూరిటీ ప్లాన్ నిబంధనల మేరకు సిద్ధం ఉన్నాయని తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు, అంతర్ జిల్లాల చెక్ పోస్టులు ఏర్పాటు ఉన్నాయని ఎప్పటికప్పుడు సీజర్ అంశాలు, ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లాలో పక్కాగా ఉన్నాయని, జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు సీజర్ చేశారని, జిల్లా యంత్రాంగం అన్ని సంసిద్ధంగా ఏర్పాట్లు చేశారు అని తెలిపారు. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వివరిస్తూ రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు బిఎల్వోల ద్వారా సంబంధిత ఓటరుకు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019 లో రీపొల్ జరిగిన చరిత్ర ఉందని, చంద్రగిరి, తిరుపతి రెండు సెన్సిటివ్ అసెంబ్లీ నియోజకవర్గాలని, వాటిలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు, శత శాతం వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ నియామకం అవసరం మేరకు వీడియోగ్రఫీ చేపడుతున్నామని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని వివరించారు. కనీస మౌలిక సదుపాయాలు పోలింగ్ కేంద్రాలలో కల్పించడంతో పాటు షేడ్, వీల్ చైర్స్, ర్యాంపు, మెడికల్ టీమ్ ఫ్లూయిడ్స్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ మాట్లాడుతూ చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గాలు సెన్సిటివ్ అని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఫ్లాగ్ మార్చ్ 840 పైగా నిర్వహించామని, అదనపు 3 కంపెనీల బలగాలు అవసరమున్నాయని తెలిపారు
Prajavartha Online Telugu News