-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వర్తించే సిబ్బందికి, అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల శాఖలు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎవరైతే నిర్ణీత దరఖాస్తులో గడువులోపు ఫారం 12 & 12డి సమర్పించిన వారు ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని మే 5, 6వ తేదీలలో వినియోగించు కోవచ్చునని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబందించి వారికి ఏ నియోజక వర్గంలో అయితే ఓటు ఉంటుందో ఆ నియోజక వర్గం ఫెసిలిటేశన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోగలరు. భారత ఎన్నికల సంఘం సవరించిన నిబంధన 18 A ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఫెసిలిటేశన్ కేంద్రంలోని డ్రాప్ బాక్స్ నందు తప్పనిసరిగా వేయవలెను.
నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వివరాలు
120 – గూడూరు (ఎస్సీ) – జడ్పీ బాయ్స్ హై స్కూల్ , గూడూరు
121 – సూళ్ళూరుపేట (ఎస్సీ)- శ్రీ వి.ఎస్.ఎస్.సి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సూళ్ళూరుపేట
122- వెంకటగిరి – విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ , వెంకటగిరి
166- చంద్రగిరి- శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ హ్యుమానిటీస్ బ్లాక్ 1, తిరుపతి
167 – తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, తిరుపతి
168 – శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్, శ్రీకాళహస్తి
169 – సత్యవేడు (ఎస్సీ)- ఎంపీడీవో ఆఫీస్, సత్యవేడు
తిరుపతి జిల్లాలో ఎలెక్షన్ విధులు నిర్వహిస్తూ పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఇతర జిల్లాల ఓటర్లు ఎస్.వి.యు. క్యాంపస్ హై స్కూల్, తిరుపతి నందు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించు కోవచ్చునని ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు విధిగా
1. ఎపిక్ ఐ డి(ఓటరు కార్డు)
2. ఆదార్ కార్డ్ మరియు ప్రభుత్వం చే జారీ చేయబడ్డ ఇతర గుర్తింపు కార్డులు.
3. ఎన్నికల విధులకు కేటాయిస్తూ ఇచిన ఉత్తర్వుల కాపీలను తీసుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు.
Prajavartha Online Telugu News