– పదేళ్లుగా ఎంతో చేశా
-ప్రజాలతోనే జీవించా
– మళ్లీ ఎం.పి.గా గెలుస్తా
-మీట్ ది ప్రెస్ లో కేశినేని నాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన తనను మరొకసారి బెజవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకుంటారని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు .బెజవాడ అన్నా.. బెజవాడ పార్లమెంటు అన్న తనకు ఎనలేని మక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు.శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో కేశినేని నానితో మీటిది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్ అధ్యక్షత వహించారు .ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేశినేని నాని మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పరితపిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తనకు విజయవాడ అంటే చాలా ఇష్టమని, విజయవాడ ప్రాంత ప్రజల కలలు నెరవేర్చే దిశగా శక్తివంతర లేకుండా పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. 2014 సంవత్సరాలకి ముందు విజయవాడ ఎలా ఉందో అందరికి తెలుసని, తాను ఎంపీ అయిన తాను ఎంపీ అయిన తర్వాత విజయవాడ ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు విజయవాడ నగరానికి రెండు ఫ్లై ఓవర్లను నిర్మాణం చేసినట్లు గుర్తు చేశారు .దుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం సాధ్యం కాదని కొంతమంది మాట్లాడారని, దాన్ని నిర్మాణం చేసి నిరూపించామని కేశినేని నాని పేర్కొన్నారు .విజయవాడ- మచిలీపట్నం బైపాస్ రోడ్డు తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించినట్లు ఆయన తెలిపారు. అమరావతిలో చంద్రబాబు ఏర్పోర్ట్ నిర్మాణం చేస్తానన్నారని, కానీ తాను గన్నవరం ఎయిర్పోర్ట్ ని అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చాలని ప్రతిపాదన పెట్టి ఒప్పించి దాని నిర్మాణాన్ని చేపట్టినట్లు కేశినేని నాని తెలిపారు .గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ఎయిర్పోర్ట్ కు కావలసిన భూములను వారి నుంచి తీసుకున్నట్లు గుర్తు చేశారు .గన్నవరం ఎయిర్పోర్ట్ను అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, కరోనా వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు జాప్యం జరిగాయని, మరి కొద్ది రోజుల్లోనే ఆ పనులన్నీ పూర్తయితాయని కేశినేని నాని తెలిపారు. అంతేకాకుండా విజయవాడ -నాగపూర్ రోడ్డు నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు .మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుందని మచిలీపట్నం నుంచి నాగపూర్ కు హైవే శాంక్షన్ చేయించినట్లు కూడా ఆయన తెలిపారు.. విజయవాడ నుంచి ఢిల్లీ చాలా తక్కువ సమయంలో ఇప్పుడు వెళ్ళిపోతామని ఆయన తెలిపారు. టాటా ట్రస్ట్ ద్వారా అనేకమందికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని, విజయవాడ పార్లమెంటు పరిధిలో ప్రతి గ్రామములో కూడా టాటా ట్రస్ట్ సేవలు అందించామని గుర్తు చేశారు. అనేక గ్రామాల్లో వాటర్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించే ఏర్పాటు కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేశినేని నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరులో కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే పార్లమెంట్లో ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేశినేని నాని గుర్తు చేశారు .ఇలా చేయడం తనకు సంతోషంగా ఉందని,నిత్యం ప్రజల్లో ఉండటం వారి బాగోగులను గుర్తించటం, వాటిని పరిష్కరించటం అనేది తనకు సంతోషాన్ని ఇచ్చే అంశం అని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేకమంది విజయవాడ పార్లమెంటుకు బాధ్యత వహించారని, వాళ్ళందరి కంటే తన అభివృద్ధి తన హయాంలోనే ఎక్కువగా జరిగిందనే విషయాన్ని ఉదాహరణలతో సహా నాని వివరించారు. 2019లో సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాలంటీర్ల పై అనేక ఆరోపణలు చంద్రబాబు చేశారని, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ బేస్ అని అందరూ అంటున్న విషయాన్ని కేశినేని నాని గుర్తు చేశారు. చంద్రబాబు చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఇంకేదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు నాని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్ని తప్పుడు ఆరోపణలు ఆయన కొట్టి పారేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయని కేశినేని నాని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐ జేయు నాయకులు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News