విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ అన్నారు. శుక్రవారం వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ మైలవరం నియోజవర్గంలోని మర్సుమిల్లి బోర్డర్ చెక్ పోస్టును ఆకస్మికంగా పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద రికార్డులను పరిశీలించారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, విధుల్లో ఉన్న ఇతర అధికారులు వాహనాలు తనిఖీ తదితర ప్రక్రియను పరిశీలించారు.
Prajavartha Online Telugu News