Breaking News

విజ‌య‌వంతంగా విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ఈవీఎం ర్యాండ‌మైజేష‌న్‌

– స‌జావుగా సాగిన తొలి స‌ప్లిమెంట‌రీ ర్యాండ‌మైజేష‌న్‌, రెండో ర్యాండ‌మైజేష‌న్‌
– జ‌న‌ర‌ల్ ప‌రిశీల‌కులు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్‌సింగ్ బాలిల స‌మ‌క్షంలో ప్ర‌క్రియ‌
– పోటీలో నిలిచిన అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి తొలి స‌ప్లిమెంట‌రీ ర్యాండ‌మైజేష‌న్ (బ్యాలెట్ యూనిట్లు), రెండో ర్యాండ‌మైజేష‌న్ (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు) ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా ముగిసింది. జిల్లా క‌లెక్ట‌రేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూంలో శుక్ర‌వారం ఉద‌యం జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ల స‌ప్లిమెంట‌రీ ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింది. మ‌ధ్యాహ్నం జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్‌సింగ్ బాలిలతో పాటు అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో బీయూ, సీయూ, వీవీప్యాట్‌ల రెండో ర్యాండ‌మైజేష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండ‌టంతో రెండో బ్యాలెట్ యూనిట్ అవసరమైన‌ట్లు తెలిపారు. ఒక బ్యాలెట్ యూనిట్‌లో 15 మంది అభ్య‌ర్థులు, ఒక నోటా బ‌ట‌న్‌కు మాత్ర‌మే వీలుంటుంద‌ని.. విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి 17 మంది పోటీలో నిల‌వ‌డంతో స‌ప్లిమెంట‌రీ ర్యాండ్‌మైజేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టి, విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. 2,147 అద‌న‌పు బీయూల కేటాయింపున‌కు ఈ స‌ప్లిమెంట‌రీ ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. అదే విధంగా ఈవీఎంల‌ను పోలింగ్ స్టేష‌న్ల‌కు అనుసంధానించేందుకు రెండో ర్యాండ‌మైజేష‌న్ కూడా చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. 4,294 బీయూలు, 2,147 సీయూలు, 2,324 వీవీప్యాట్ల‌కు సంబంధించి ఈ ప్ర‌క్రియ చేప‌ట్టిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు వివ‌రించారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వాములు కావాలి: జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్ సింగ్ బాలి ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యిన అనంత‌రం జ‌న‌ర‌ల్ అబ్జ‌ర్వ‌ర్లు మంజూ రాజ్‌పాల్‌, న‌రీంద‌ర్‌సింగ్ బాలిలు విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి పోటీలో నిలిచిన అభ్య‌ర్థులు, అభ్య‌ర్థుల ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌ని పేర్కొన్నారు. వివిధ అంశాల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి త‌మ‌కు ఫిర్యాదు చేయొచ్చ‌న్నారు. వేస‌వి నేప‌థ్యంలో పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద చేయాల్సిన ఏర్పాట్ల‌పైనా చ‌ర్చించారు. అదే విధంగా పోస్ట‌ల్ బ్యాలెట్ విధివిధానాలు, అర్హులైన వారు వినియోగించుకునే విధానంపైనా క‌లెక్ట‌ర్ డిల్లీరావు అవ‌గాహన క‌ల్పించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్వో వి. శ్రీనివాసరావు, ఎన్నిక‌ల సెల్ సూప‌రింటెండెంట్ ఎం.దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *