Breaking News

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 73 శాతం హోం ఓటింగ్…

గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 73 శాతం హోం ఓటింగ్ ని శుక్రవారం పూర్తి చేయడం జరిగిందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం చౌత్రా సెంటర్ లో జరుగుతున్న హోం ఓటింగ్ ని తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో కమిషనర్ & ఆర్ఓ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా హోం ఓటింగ్ విధానంను కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం హోం ఓటింగ్ కి అమలు చేస్తున్న మార్గదర్శకాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 97 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. హోం ఓటింగ్ నిర్వహణకు సీనియర్ గెజిటెడ్ అధికారులతో 5 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన హోం ఓటింగ్ లో 97 మంది ఓటర్లకు గాను 71 మంది ఓట్లు పోల్ చేసి 73 శాతం పోలింగ్ జరిగిందన్నారు. శనివారం హోం ఓటింగ్ లో మిగిలిన వారి ఓట్లు పోల్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. హోం ఓటింగ్ ప్రక్రియలో అధికారులతో పాటుగా తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఎలక్షన్ ఏజంట్లు కూడా పాల్గొని ఎన్నికల సరళిని పరిశీలించారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *