Breaking News

ప్రజల నెత్తిన పెనుభారం మోపిన వైకాపా సర్కారు…

-రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు
-ఏపీని సర్వనాశనం చేశారు
-రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే టీడీపీ మహాకూటమికే సాధ్యం
-మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్
-చెవుటూరులో ఎన్నికల ప్రచారం

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఐదేళ్ల వైకాపా పాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా దివాళా తీసిందని, రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపారని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

జి.కొండూరు మండలంలోని చెవుటూరు, వెంకటాపురం గ్రామాల్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపి తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ), జనసేన నేత బొలియాశెట్టి శ్రీకాంత్, జనసైనికులు, వీరమహిళలు కూడా పాల్గొన్నారు.

మహాకూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మీరంతా టిడిపికి ఓటు వేయాలని కోరారు.

తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు అమరావతి రైతులు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్లు మూసేసి అందరికీ అన్యాయం చేశారన్నారు.

తెలుగుదేశం మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి బాధితులంతా మీ అందరి భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపాలనపరంగా మళ్లీ గాడిలో పెట్టగలిగే మహాకూటమికి అఖండ విజయం చేకూర్చాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన చంద్రబాబు నాయుడు తోనే సాధ్యపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను విజయవాడ టిడిపి అభ్యర్థి కేసినేని శివనాథ్ (చిన్ని)ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీ, జనసేన, టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *