Breaking News

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో చర్చించిన కలెక్టర్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం గన్నవరం విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఇతర పోలీసు అధికారులు, విమానాశ్రయం భద్రత అధికారులతో ప్రధాని భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈనెల 8వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లు, కాన్వాయ్ , జిల్లా పరిధిలో ప్రధాని పర్యటించే రోడ్డు మార్గం జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కలెక్టర్ గన్నవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రం, పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి ఎస్పీ కలిసి సందర్శించారు. అత్యవసర పరిస్థితులలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *