-ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసిన 510 ఎలక్షన్ సిబ్బంది
-మే 5, 6 తేదీలలో కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఎలక్షన్ సిబ్బందీ ఓటు వినియోగించుకోగలరు – సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో, ఫామ్ 12 దరఖాస్తు చేసుకున్న పోలింగ్ సిబ్బంది అనగా PO’s, APO’s, OPO’s, సెక్టర్ ఆఫీసర్స్,మైక్రో అబ్సర్వర్స్ BLO’s, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, క్లీనర్లు, పోలీస్ సిబ్బంది,NCC, NSS మొదలగు వారికి 2024 మే 4,5,6 తేదీలలో సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో గల పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్, మొగల్రాజపురం నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అందుబాటులో ఉండగా. 510 ఎలక్షన్ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. 2024 మే 5, 6 తేదీలలో కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను విచ్చేసి తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోగలరని తెలిపారు.
Prajavartha Online Telugu News