Breaking News

ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి

నగరంలో స్వీప్ కార్యకలాపాల ద్వారా ఓటర్ల లో చైతన్యం
-సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం శనివారం రాత్రి స్ధానిక కోటగుమ్మం నుంచి పుష్కర్ ఘాట్ వరకూ కాండిల్ ర్యాలీ ని నిర్వహించినట్లు సర్వ శిక్ష అభియాన్ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఖచ్చితంగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల లో ఓటర్లు పాల్గొనడం, వారి ఓటు హక్కును వినియోగించుకోవడం మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం ఎన్నికలలో పాల్గొని ఓటు వెయ్యడం అని తెలియ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ లో స్వీప్ నోడల్ అధికారులు ఎస్. సుభాషిణి, కే. ఎన్. జ్యోతి, కే. వాసుదేవరావు, సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *