-పోస్టల్ బ్యాలెట్ షెడ్యుల్ వివరాలు రాజకీయ పార్టీలకు అందచేశాం
-ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా వినియోగించు కోవాలి
-జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి
– కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల విధుల్లో, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈమేరకు జిల్లా స్థాయిలో, నియోజక వర్గాల పరిధిలో విస్తృతమైన ఏర్పాట్లు చెయ్యడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్క ఓటరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం అందించామని, వారి తరపున ఏజెంట్ల ను నియమించుకుని, సంభందిత రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలియ చెయ్యాలని స్పష్టం చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా వినియోగించుకోవాలని, జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజక వర్గాల పరిధిలో పీవోలు, ఎపివోలు, ఓపివోలు, ప్రభుత్వ అధికారులు, మైక్రో అబ్జర్వర్స్, పోలీసు ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ముఖ్యమైన తేదీలు / ప్రదేశం :
పీవో మరియు ఏపివొలకు వారికీ శిక్షణ కార్యక్రమం అనంతరం పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కునే ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందనీ తెలిపారు. నియోజక వర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలలో శిక్షణ మరియు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ మే 6 (సోమవారం) శిక్షణ కార్యక్రమం అనంతరం పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేశామన్నారు.
పోలీసులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మే 7 (మంగళవారం) ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, రాజమండ్రిలో – ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు
మైక్రో అబ్జర్వర్లు – శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మే 7 (మంగళ వారం) ఉదయం 9 గంటలకు శిక్షణ, అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్
ఎసెన్షియల్ సర్వీస్ ఉద్యోగులకు (అత్యవసర సేవలు నిర్వహించే) ఓటర్లు – ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, న్యూ క్యాంపస్, పిడింగోయి నందు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ – మే 7 (మంగళవారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఇతర పోలింగు సిబ్బంది (OPO) కి మే 8 (బుధవారం) వారికి కేటాయించిన నియోజక వర్గాల పరిధిలో ఉన్న శిక్షణా కేంద్రాలలో శిక్షణ, అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్
“ఇవే నియోజకవర్గాల వారీగా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు” :
నియోజకవర్గం సంఖ్య పేరు & ఫేసిలిటేషన్ కేంద్రం …
40 – అనపర్తి – పి వో/ ఏ పీవో ల కోసం – శ్రీ రామారెడ్డి జెడ్పీపి హై స్కూల్, అనపర్తి
40 – అనపర్తి ఇతర పొలింగ్ సిబ్బంది (OPO) జిబిఆర్ కాలేజ్ , అనపర్తి
49- రాజానగరం – బీవీసి ఇంజనీరింగ్ కాలేజీ, పాలచేర్ల
50- రాజమండ్రి సీటీ – బుధ భవన్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కాంపౌండ్, రాజమహేంద్రవరం
51- రాజమండ్రి రూరల్ – ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, కవలగొయ్య, పీడింగొయ్య , రాజమండ్రి రూరల్
54- కొవ్వూరు (ఎస్సి) – శ్రీ సుందర శ్రీ కల్యాణ మండపం, కొవ్వూరు
55- నిడదవోలు – వికాస్ జూనియర్ & డిగ్రీ కళాశాల, సమిస్ర గూడెం, నిడదవోలు మండలం
66 – గోపాలపురం (ఎస్సీ) – డా బి ఆర్ అంబేద్కర్ గురుకులం (బాలికల) రెసిడెన్షియల్ స్కూల్, గోపాలపురం
• 2024 మే 6, 7, 8 తేదీలలో ఉద్యోగులకు డ్యూటీ ఆర్డర్లు వచ్చిన వారు వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి.
• ఎటువంటి డ్యూటీ ఆర్డర్లు రాని ఉద్యోగులు మే 13వ తేదీన (అనగా పోలింగు రోజున) నేరుగా సంబంధిత పోలింగు కేంద్రములో వారి యొక్క ఓటును వినియోగించుకోవచ్చును.
Prajavartha Online Telugu News