Breaking News

ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటర్లకు తగిన సమాచారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఏసి కాలేజిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటర్లకు తగిన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం స్థానిక ఏసి కాలేజిలోని ఫెసిలిటేషన్ సెంటర్ ని పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ కి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అనువుగా ఏసి కాలేజి ఫెసిలిటేషన్ సెంటర్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ముందుగా హెల్ప్ డెస్క్ లో తమ ఓటు వివరాలు తెలుసుకొని, ఓటింగ్ కోసం వివిధ నియోజకవర్గాలకు వేరు వేరుగా ఏర్పాటు చేసిన 6 ప్రత్యేక కౌంటర్లలో ఓటు వినియోగించుకోవచ్చని తెలిపారు. 7వ తేదీ ఓపిఓలు, 8వ తేదీ పోలీసులు, ఎన్నికల విధులు కేటాయించబడిన ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కి ఏర్పాట్లు చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *