Breaking News

రాష్ట్రం లో ఐదేళ్లు సుస్థిర పాలన అందించాం…

-భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపించండి, సంక్షేమం మరియు అభివృద్ధి కొనసాగించండి.
-మంత్రి ఆర్.కె.రోజా

నిండ్ర, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో ఐదేళ్లు సుస్థిర పాలన అందించామని, భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపిస్తే సంక్షేమం మరియు అభివృద్ధి కొనసాగుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా పిలుపునిచ్చారు. నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, చవరంబాకం,కె.ఆర్.పురంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరోసారి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నగరిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, చవరంబాకం, కె.ఆర్.పు రం లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజమ్మకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలుకగా, యువత జగనన్నకు రోజమ్మ కు జేజేలు పలికి బ్రహ్మరధం పట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, నగరి నియోజకవర్గంలో తాను గత ఐదేళ్ళలో అమలు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు క్రియాశీల సభ్యులు, జే.సి.ఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కమిటీ చైర్మన్లు, మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *