Breaking News

శ్రీకాళహస్తి స్కిట్స్ కాలేజీ నందు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని, పార్లమెంట్ ఈవీఎం కమిషనింగ్ ను పరిశీలించిన ప్రవీణ్ కుమార్

-రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఎన్నికల విధులు కేటాయించబడిన, అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులలో ఉండి పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సేవల వారు నేటి దినం మే 6న రెండో రోజు. జిల్లాలో రిటర్నింగ్ అధికారుల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ప్రశాంతంగా తమ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కుంటున్నారని, శ్రీకాళహస్తి స్కిట్స్ కళాశాల ఫెసిలిటేషన్ సెంటర్ నందు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ ఈవిఎం కమిషణింగ్ ఉదయం నుండి ప్రారంభమైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 168- శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు స్కిట్స్ కాలేజ్ శ్రీకాళహస్తి నందు ఏర్పాటుచేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్/ ఫెసిలిటేషన్ సెంటర్ ను, అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం అదే ప్రాంగణంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సంబంధించిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డికి సూచించారు.

రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు వివరిస్తూ త్రాగునీరు మజ్జిగ, చైర్స్, షేడ్ తదితర కనీస సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ ఈవిఎం ల కమిషణింగ్ ఉదయం నుండి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ప్రారంభం అయిందని 41 సెక్టర్లుగా 41 టేబుల్ లతో 9 రౌండ్లలో జరిగేలా ఏర్పాటుతో బెల్ ఇంజనీర్లు, సుమారు 400 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారని సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు. బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ యూనిట్ నందు ఫిక్స్ చేయడం, కమిషనింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కొనసాగుతోందని వివరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మునిసిపల్ కమిషనర్ రమేష్, తాసిల్దార్ జనార్దన్ రాజు, సర్వే మరియు స్ట్రాంగ్ రూం సిబ్బంది, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *