Breaking News

రెండో రోజు ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఎన్నికల విధులు కేటాయించబడిన, అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులు

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులలో ఉండి పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు, అత్యవసర సేవల వారు నేటి దినం మే 6న రెండో రోజు 121- సూళ్లూరుపేట విఎస్ఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం నందు తమ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని, అలాగే 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సూళ్లూరుపేట పిసి ఈవిఎంలలో సింబల్ లోడింగ్ ఉదయం నుండి ప్రారంభమైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 121- సూళ్లూరుపేట విఎస్ఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్/ ఫెసిలిటేషన్ సెంటర్ ను, అక్కడ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం అదే ప్రాంగణంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సూళ్లూరుపేట పిసి ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఏర్పాట్లు బాగున్నాయని, కొనసాగించాలని రిటర్నింగ్ అధికారి సూళ్లూరుపేట చంద్రముని కి సూచించారు.

రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు వివరిస్తూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, క్యూ లైన్ ఏర్పాటు చేశామని, త్రాగునీరు, మజ్జిగ, చైర్స్, షేడ్ తదితర కనీస సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే 23-తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సూళ్లూరుపేట పిసి ఈవిఎం ల కమిషనింగ్ రేపు ఉదయం నుండి ప్రారంభిస్తామని, ఈ రోజు వివి ప్యాట్ లలో సింబల్ లోడింగ్ జరుగుతోందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో నిర్వహిస్తున్నామని, వీడియోగ్రఫీ చేస్తున్నామని, తగినంత బందోబస్తు నడుమ చేపట్టామని, 44 సెక్టర్లుగా 44 టేబుల్ ల ఏర్పాటుతో 3 బెల్ ఇంజనీర్లు, సుమారు 150 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారని సకాలంలో పూర్తి చేస్తామని వివరించారు. ఈవిఎం ల కమిషనింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేపడుతున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి సూళ్లూరుపేట శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, సూళ్లూరుపేట తాసిల్దార్ గోపాల కృష్ణ, తడ తాసిల్దార్ ఇక్బాల్, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *